Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ప్రభుత్వాలపై తిరగబడాలి
- రాజీలేని పోరాటాలను నిర్వహి ంచే సత్తా ఎర్ర జెండాకే సాధ్యం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్పొరేట్ల కు దాసోహమై పాలన సాగిస్తున్న ప్రభుత్వాలపై తిరగబడాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉదృతం చేయాలని, రాజీలేని పోరాటాలను నిర్వహించే సత్తా ఎర్ర జెండాకే సాధ్యం, కమ్యూనిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య ఉద్ఘాటించారు. కూలీ లైన్ బస్తీ, శ్రామిక మహిళా శాఖల మహాసభల సందర్భంగా ఎర్ర జండాను సీపీఐ(ఎం) సీనియర్ కార్యకర్త ఎంవి. నర్సయ్య ఆవిష్కరించారు. సీపీఎం పట్టణ నాయకులు సందకూరి లక్ష్మి అధ్యక్షత జరిగిన సభలో కాసాని మాట్లడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ అడ్డగోలుగా ఉండటం, పెట్టుబడిదారి విధానాల ఫలితంగా ధరలు పెరిగి ప్రజలపై భారాలు మోపుతూ అసమానతలు రోజూ రోజుకి పెరుగుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నా భిన్నంగా ఉన్న ప్రజల జీవితాలను సన్మార్గంలో పెట్టుకుండ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేస్తు, కమ్యునిస్ట్ చైనా, లాటిన్ అమెరికా దేశాల్లో కమ్యునిజం ఔన్నత్యాన్ని చాటుతూ నంబర్ వన్‌గా నిలిచి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ఉద్యమాలు నిర్మించి బలమైన పార్టీగా సీపీఎంని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ మహాసభలో సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, సందకూరి లక్ష్మి, జూనుమలా నగేష్, జంజర్ల లక్ష్మి, మండేల మల్లిఖార్జున్, సైదమ్మ, పద్మ, మాధవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.