Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవికుమార్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజనులు జీవనాధారంగా ఏళ్ల తరబడి పోడు కొట్టి సాగు చేసుకుంటున్న భూములను అధికారులు హరితవనాల పేరుతో గుంజుకుంటున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవికుమార్ అన్నారు. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సుమారు 15 గిరిజన కుటుంబాలు 32/3 సర్వే నెంబరులో 15 ఎకరాల 37 సెంట్లు గత 25 సంవత్సరాలు గా సాగు చేసుకుంంటున్నారని కోరుతూ బుదవారం దుమ్ముగూడెం మండల పర్యటనకు వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు గ్రామస్తులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగు దారుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. జీవనాధారమైన భూమిలో స్థానిక తహశీల్దార్ హరిత వనం పేరుతో మొక్కలు నాటాడన్నారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి గిరిజన రైతులకు న్యాయం చేయాలని గిరిజన రైతుల తరపును ఎమ్మెల్యే దృష్టికి తీసుకు పోయారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో గిరిజన రైతులు ఇర్పా మల్లూరు, కె. శ్రీను, కారం నర్సింహారావు, వెంకటేష్ , రాముడు తదితరులు ఉన్నారు.