Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీ మృతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
రెండు ఆటోలు ఎదురెదుగా ఢీ కొన్న సంఘటనలో ఒక కూలీకి తీవ్రగాయాలై మార్గం మధ్యలో మృతి చెందిన వైనం గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై కథనం ప్రకారం...మండల పరిధిలోని బచ్చువారిగూడెంకు చెందిన పలువురు కూలీలు ఆటోపై బయలు దేరారు. వీరి ఆటో డ్రైవర్ నారాయణపురం కూడలిలో ఆపి కూలీలను దించుతుండగా అదేసమయంలో మరో ఆటో డ్రైవర్ తన ఖాలీ ఆటోతో వినాయక పురం వైపునుండి రంగాపురం వెళ్తూ నారాయణపురంలో కూడలిలో ఆగి ఉన్న ఆటోను ఢ కొట్టాడు.
ఇందులో ఒక పక్క కూర్చున్న బచ్చువారిగూడెంకు చెందిన వెట్టి ముత్యం (33) రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదానికి గురైన ముత్యం అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు డాక్టర్ అనుదీప్ ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్ళాల్సింది కుటుంబ సభ్యులకు సూచించారు. ఖమ్మం తరలిస్తుండగా ముత్యం మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు ఎస్.ఐ అరుణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.