Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థంబించిన జనజీవనం
- నిలిచిపోయిన రాకపోకలు
నవతెలంగాణ-గుండాల
గత మూడు రోజులుగా కురుస్తున్న ఈదురు గాలులతో కూడిన వానలకు మండలంలోని మల్లన్న, కిన్నెరసాని, ఏడుమెలికల వాగులతో పాటు దున్నపో తుల, తొట్టివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుండి కురుస్తున్న వాన లతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ వ్యవసా య పనులు సాగడం లేదని అనుకుంటున్నారు.
దుమ్ముగూడెం : అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా మండలంలో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుండి కొండకు చిల్లు పడినట్టుగా రోజంతా వర్షం ధారలుగా కురిసింది. మండలంతో పాటు ఎగువ ప్రాంతమైన చత్తీష్‌ఘడ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చిన్నగుబ్బలమంగి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు చేరి అలుగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాటు ప్రధాన వాగులైన సీతవాగు, చిన్నగుబ్బ లమంగి, తూరుబాక వాగులు వర్షపు వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలో ఉన్న ప్రదాన చెరువులు కుంటలలోకి వర్షపు నీరు చేరుతూ జల కళతో కళ కళ లాడుతున్నాయి. సున్నంబంట్టి వద్ద వర్షపు వరద రహదారిని ముంచెత్తండంతో రెండవ రోజు సున్నం బట్టి గ్రామస్తులు రాక పోకలకు ఇబ్బందులు పడ్డారు. సంగెం గ్రామం చుట్టూ వర్షపు వరద మెంచెత్తడంతో ఆ గ్రామం జలదిగ్బందంలో చిక్కుకుంది. ఇటీవల పోసిన వరి నారు మళ్లు అధిక వర్షానికి కొట్టుకు పోయాయి. పలు గ్రామాల్లో అంతర్గత రహదారులు బురదమయంగా మారడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
జూలూరుపాడు : ఎడ తెరపు లేకుండా గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గురువారం తహసీల్దార్ తన సిబ్బందితో కలసి మండలంలోని పాపకొల్లు, అన్నారపాడు బెతాలపాడు తదితర గ్రామాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులను, చెరువులను సందర్శించారు. జాగ్రత్తలు పాటించాలని మండల ప్రజలుకు సూచించారు.
అశ్వాపురం : మండలంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విఫరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా మారుమూల గిరిజన గ్రామాలైన మనుబోతులగూడెం, వేమూలురు, ఎలకలగూడెం, గొందిగూడెం గ్రామాలతోపాటు మామిళ్ళవాయి, వెంకటాపురం, తుమ్మలచెరువు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పాడ్డాయి. అత్యవసర పరిస్థితులలో ప్రయాణాలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. కేవలం అధికారులు, పాలకుల నిర్లక్ష్యం మూలానే ప్రతీ ఏటా ఇలా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన సంబందిత శాఖల ఉన్నతాధికారులు ఏజెన్సి గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
అశ్వారావుపేట : గతరెండు రోజులుగా అల్పపీడనం కారణంగా తుపాను సంభవించడంతో సమృద్ధిóగా వర్షాలు పడుతున్నాయి. దీంతో మండలంలోని వాగులు, వంకలు, కుంటలు, చెరువులు వరదనీటిలో నిండుకుండలా తలపిస్తున్నాయి. గురువారం మండలంలో 38.07 వరషపాతం నమోదు అయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ కేంద్రం పర్యవేక్షకులు తెలిపారు. మండల పరిధిలోని పెద్ద చెరువుగా పేరున్న ఊట్లపల్లి-అశ్వారావుపేట మద్యలో గల అంకమ్మ చెరువు సామర్ధ్యం 75 ఎం.సి.ఎఫ్.టీ కాగా దీనికి మించి వరద చేరడంతో అలుగు పొంగిపొర్లుతుంది. దీంతో అంకమ్మ చెరువు మిగులు నీరు పారే నల్లబాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా నల్లబాడు-వాగొడ్డుగ ూడెం మద్యలో రహాదారిపై వరద నీరు చేరడంతో ఈ రెండు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి.
టేకులపల్లి : మండలంలోని టేకులపల్లి నుంచి వస్తున్న వాగు ముత్యాలంపాడు గ్రామ సమీపంలో చప్టాపై కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న సమయంలో కొత్త తండా, రాం పురం తండా, మాలపల్లి గ్రామాలకు చెందిన వారు ముత్యాలంపాడు మీదుగా టేకులపల్లి వెళ్ళుటకు రాకపోకలు లేకపోవడంతో ప్రజలు గురువారం నానా ఇబ్బందులు పడ్డారు. ఈ రహదారిని తహసీల్దార్ కె వి శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు.