Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయాన్ని అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 08744-241950 నెంబర్ తో 24 గంటలు పని చేయు విధంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాల వల్ల జిల్లా లోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిలిపారు. వరదలకు సంబందించి సహాయతకు ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేయాలన్నారు. కంట్రోల్ రూముకు వచ్చిన సమస్యను సంబందిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరిస్తారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సేవలు నిమిత్తం అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సిబ్బందికి అన్ని రకాల సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.