Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రేణుక
నవతెలంగాణ-భద్రాచలం
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా నాయకురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వర్ధంతి సభ టౌన్ అధ్యక్షురాలు డి.సీతాలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక మాట్లాడుతూ ఐద్వా జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్లో కెప్టెన్గా కీలకపాత్ర పోషించడంతో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో మహిళలు, కార్యకర్తలు సమస్యలు వచ్చినప్పుడు పోరాటాల్లో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా మహిళా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్ సభ్యులు యన్.లీలావతి, జిల్లా కమిటీ సభ్యులు యు.జ్యోతి, బి.కుసుమ, టౌన్ ఆఫీస్ బేరర్ పి.రాజేశ్వరి, సున్నం గంగ, కుమారి తదితరులు పాల్గొన్నారు.