Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయాల చైర్మన్ దిండిగాల రాజేందర్
నవతెలంగాణ-కొత్తగూడెం
దాశరధి కృష్ణమాచార్యులు కవితలు బడుగు బలహీన, పేద వర్గాల చైతన్య దీపికలని జిల్లా గ్రంథాలయాల చైర్మన్, తెలంగాల మలిదశ ఉద్యమనేత దిండిగాల రాజేందర్ అన్నారు. గురువారం దశరతి 96వ జయంతి వేడుకలు కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే కవితలు, రచనల పట్ల మక్కువ పెంచుకున్న దాశరథి సమాజ హితం కోసం తన కలానికి పదును పెట్టారని చెప్పారు.మదిరలో విద్యాభ్యాసం కొనసాగిందన్నారు. కమ్యూనిస్టు భావాజాలనికి ఆకర్షితులైన ఆయన ఆ దిశగా అడుగులు వేసి పేద, ఐదుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి. మణి మృధుల, సిబ్బంది రుక్మిణి, శైలజ, పాఠకులు మునీర్, జయరాం, శివ, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.