Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ముదిరాజ్ కాలనీలోని విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న బంధువులు వర్షాలకు రాలేకపో తున్నామని సమాచారం అందించారు. దీంతో ముదిరాజ్ కాలనీకి చెందిన ముదిరాజ్ యువత మహిళ దహన సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు వచ్చారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రం నుంచి ముదిరాజ్ శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో కూడా ముదిరాజ్ యువత చనిపోయిన మహిళ పార్ధివదేహాన్ని భుజాలపై వేసుకొని వాగులో దాటించి దహన సంస్కరణలు చేపట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యసాహసాలతో దహన సంస్కారాలు చేసిన ముదిరాజ్ యువతను గ్రామస్తులు అభినందించారు.