Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛలో కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.
- డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్
నవ తెలంగాణ- రఘునాధపాలేం
నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ప్రకటించి, జాబ్ క్యాలెండర్‌ని విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సానిక నాగేశ్వరరావు కుటుంబానికి యాభై లక్షల ఎక్స్‌గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూళ్లు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని నిరుద్యోగ యువతకి డివైయఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల,రమేష్ పిలుపునిచ్చారు.
స్థానిక చిమ్మపుడి గ్రామంలో డి వై యఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు.కార్యక్రమంలో డి వైయఫ్ఐ మండల, గ్రామ నాయకులు దశరద, వీరబాబు, రాచర్ల నరేష్, దొంతూ గణేష్, జోనెబోయిన.నవీన్, దశరథ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.