Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
మండల పరిధిలోని గంగారం గ్రామంలోని సాయిస్పూర్తి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు ప్రముఖ లెవెల్5 సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఏక్సెంచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కొలువులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ విజరుకుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాంగణా నియామకాల్లో టాస్క్ అనుబంధంగా నిర్వహించిన ఇంటర్వూల్లో తమ విద్యార్ధులు ఎస్.సాయిప్రసన్న, టీ.లకీë వైష్ణవి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి కొలువులు సాధించినట్లు తెలిపారు. అదే విధంగా వివిధ లెవెల్5 కంపెనీల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్ధులు 19 మంది కొలువులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కళాశాల ఛైర్మెన్ బండి పార్ధసారధిరెడ్డి మాట్లాడుతూ కొలువులు సాధించిన విద్యార్ధులను, వారిని ప్రోత్సహించి సహకరించిన అధ్యాపకబృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ ఎండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, కళాశాల సీఎస్ఈ విభాగాధిపతి ఎస్కె యాకూబ్, కళాశాల టాస్క్ ఇంఛార్జి బి.సంతోష్ పాల్గొన్నారు.