Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముల్కలపల్లి
రైతుల అప్పులు మాఫి చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో సీపీఐ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ, ఏపీజీవీబీ బ్యాంక్‌ల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిందన్నారు. మూడేళ్ళ కావస్తున్నా నేటికి రుణ మాఫీ చేయలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ లకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో రైతు నాయకులు కీసరి గంగ రాజు, రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, సున్నం ప్రసాద్, కీసరి జోగులు, లక్ష్మీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.