Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేజ్ బోర్డు సభ్యుడికి వినతి
నవతెలంగాణ-మణుగూరు
దేశ వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించాలని వేజ్‌బోర్డు సభ్యులు కొత్తకాపు లక్ష్మారెడ్డికి కాంట్రాక్ట్ కార్మికులు వినతి పత్రం అందజేశారు. గురువారం పివికాలనీలోని నూతన బిఎంఎస్ కార్యాలయాన్ని ఆయన పాల్గొని ప్రారంభించారు. అనంతరం కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని లక్ష్మారెడ్డిని వారు కోరారు. ఈ ప్రారంభోత్సవంలో మరో వేజ్ బోర్డు సభ్యులు నరేంద్రకుమార్ సింగ్, సుదీర్ గూడ్రే, జాతీయ కార్యదర్శి మండ రమాకాంత్, పులిరాజారెడ్డి, యాదగిరి సత్తయ్య, పి.మధవనాయక్, బుర్గుల లకీëనారాయణలు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు వీరమనేని రవీందర్రావు, కిషన్, శివరావు, పర్స నర్సింగరావు, ఈ.రామక్రిష్ణ, మళ్లీకార్జున్, వెంకటేశ్వ రరావు, బ్రహ్మం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.