Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజిలో పుట్టి తెలంగాణలో సిరులు పంచి
- నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్టు
- 11 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 12,727 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నవతెలంగాణ-చర్ల
ఏజెన్సీ పురోభివృద్ధికి ఎంతో ఊరట ఇచ్చి గడిచిన మూడు దశాబ్దాల నుండి ఏజెన్సీ వరప్రదాయినిగా కీర్తించబడు తున్న తాలిపేరు ప్రాజెక్టు పై నవతెలంగాణ అందిస్తున్న కథనం''.
ఏజెన్సీలో సమృద్ధిగా నీటి వనరులను ఉపయోగించని రోజుల్లో ఈ ప్రాంతంలో జొన్నలు పండించేవారు. నాడు ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలను గ్రహించి చింతలచెరువు వెంకటాద్రి కుటుంబీకులు నాటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావును ఈ ప్రాంతా నికి తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజలు పడుతున్న బాధలను వివరించి సమృద్ధిగా ఉన్నా నీటి వనరులను నిల్వచేయడానికి 1978లో తాలిపేరు ప్రాజెక్టు పునాది వేయించారు. నాడు కేవలం రూ.12 కోట్లతో ప్రారంభమైన తాలిపేరు మధ్యత రహ ప్రాజెక్టు పూర్తిగా నిర్వహించడానికి 18 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు గణాంకాలు తెలుపు తున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ, జలగం వెంగళరావు హయాంలో జరిగిన అభివృద్ధి వల్లే నేడు ఈ ప్రాంత గిరిజన గిరిజనేతర రైతులు పత్తి, వరి, మిర్చి పండించడానికి సౌలభ్యంగా ఉందని చెప్పవచ్చు తాలిపేరు నిర్మించక ముందు ఈ ప్రాంత అభివృద్ధి నత్తనడకన ఉండేదని, తాలిపేరు ప్రాజెక్టు నిర్మించిన తరువాత రెండు పంటలు ధాన్యం పండించి గిరిజన గిరిజనేతర రైతులు దినదిన అభివృద్ధి చెందుతున్నారని పలువురు తెలుపుతున్నారు.
నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్టు..
చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు వరద నీటితో పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమె ౖనారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ తాలిపేరు డ్యామ్ వద్ద 11 గేట్లు 2 అడుగుల మేరా ఎత్తి 12,727 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 10,883 క్యూసెక్కుల నీరు (ఇన్‌ఫ్లో) వస్తున్నట్లుగా తాలిపేరు డీఈఈ తిరుపతి తెలిపారు. ప్రాజెక్టు క్రస్ట్ లెవల్ 69 మీటర్లు.
74 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ప్రస్తుత వరద ఉదృతిని బట్టి 72.25 మీటర్ల నీటిని నిల్వచేస్తూ, అదనపు నీటిని గేట్లుఎత్తి దిగువకి విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లో గంటగంటకు వరద పెరుగుతోంది. తాలిపేరు పడవలను చూడడానికి పర్యాటకులు ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తున్నారు.