Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహించిన పర్సా, మంచికంటి హెల్ప్ లైన్ సభ్యులు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంలో కరోనా మృత దేహానికి పర్సా, మంచీకంటీ హెల్ప్ లైన్ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. గురువారం నిర్వహించి కార్యక్రమం అనంతరం హెల్ప్ లైన్ బాధ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అశ్వారావుపేట నివాసి అయిన రంగమ్మ బుధవారం రాత్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కరోనా వైరస్‌తో మరణించిందని తెలిపారు. ఈ భారీ వర్షాలవలన మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయడానికి వీలు లేని పరిస్థితిలో రంగమ్మ కుటుంబ సభ్యులు పర్సా, హెల్ప్‌లైన్ సెంటర్‌ని సంప్రదించారని తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న హెల్ప్ లైన్ సభ్యులు మచ్చ వెంకటేశ్వ ర్లు, జాతోత్ కృష్ణ, భూక్యా రమేష్, వీర భద్రం, వాంకు డోత్ రవి, చంటి వెంటనే ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, కుండపోతగా వర్షం కుండపోతగా కురుస్తున్నప్పటికీ వర్షాన్ని లెక్క చేయకుండా మృత దేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి, కొత్తగూడెం గాజుల రాజం బస్తీ శివారులోని హిందు శ్మశానవా టికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
కరోనా బాధితులకు అండగా మేము ఉన్నామని, పర్స-మంచికంటీ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా రోగులకు సహయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.
మీకు జీవితాంతం రుణపడి ఉంటాం...రంగమ్మ కుటుంబ సభ్యుడు సాంబయ్య
పర్సా-మంచికంటి హెల్ప్ లైన్ సభ్యుల సహాకారంతో మా అత్తగారి (రంగమ్మ) దహన సంస్కారాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమ న్నారు. పిలిచిన వెంటనే మా వద్దకు చేరుకొని, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమను చూపించి క్రతువు చేశారన్నారు. ఈ కార్యక్రమాలూ చేస్తున్న, పర్సా, మంచి కంటి హెల్ప్‌లైన్ సేవలకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.