Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- రూ.కోట్లలో నష్టం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షలకు సామాన్య ప్రజలనీక జీవం అతలాకుతలం అయింది. వర్షాలకు నానిన ఇండ్లు, గోడలు కూలిపోయాయి. లోతట్లు ప్రాంతాలు జలమయంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలోని భారీ పరిశ్రమ అయిన సింగరేణి పరిశ్రమకు భారీ వర్షం కారణంగా భారీగా నష్టం కలిగింది. సింగరేణిలోని ఓపెన్ కాస్టు బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. 11 ఏరియాలలో బొగ్గు ఉత్పత్తి జరుగలేదు. కారణంగా పెద్ద ఎత్తున ఆర్దికంగా నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సింగరేణి సంస్థ వ్యాప్తంగా కొత్తగూడెం,ఇల్లందు, రామగుండం -1, రామగుండం-2, రామగుండం-3,అడ్రియాల ప్రాజెక్టు, భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్లలో ఓపెన్‌కాస్టులలో బొగ్గు ఉత్పత్తి లక్ష్మానికి తీవ్ర అంతరాయం కలిగింది.ప్రతి రోజు ఒక్కో ఓపేన్కాస్టుల నుండి 10 వేల టన్నుల తగ్గకుండా బొగ్గు ఉత్పతి చేస్తారు. దీన్ని పట్టి చూస్తే మొత్తంగా ఉన్న 19 ఓసీలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, క్వారీలకు చేరిన నీటి కారణంగా 4.లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా కోట్టాదిరూపాయల మేర భారీ ఆర్ధిక నష్టం జరిగి ఉంటుందని తెలుస్తుంది.
మణుగూరు : మణుగూరు సబ్ డివిజన్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజువారి ఉత్పత్తి 3వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాల్సి వుండగా పూర్తి స్తంభించింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వర్షాల కారణంగా నత్తనడకన సాగాయి. మణుగూరు మున్సిపాలిటీ, మండలంలో లోతట్టు ప్రాంతాలు వరదమయ్యాయి. దీని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటీవల అంబేద్కర్ సెంటర్ నుండి రైల్వే గేట్ వరకు నిర్మించిన సైడ్ డ్రైనేజీ ఒక పక్కనే నిర్మించడంతో నీరు ఎటూపోకుండా రోడ్డుపైనే నిలిచాయి. నిర్మాణ పనులు పూర్తి అయిన కాలువ ఎత్తుగా వుండడంతో వర్షపు నీరు కాలువలోకి పోలేక చెరువులను తలపిస్తున్నాయి. 109.6 మీ.మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీని కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడడంతో గత రెండు రోజుల నుండి ఏరియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏఈ వేణుగోపాల్ ఆధ్వర్యంలో లైన్మెన్ సిబ్బంది రాత్రిపగలు అనక శ్రమించి ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా పనిచేశారు.
టేకులపల్లి : కోయగూడెం ఉపరితల గనిలో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం జరుగుతున్నట్టు ప్రాజెక్టు అధికారి ఎం.మల్లయ్య గురువారం తెలిపారు. బుధ, గురువారంలో కురుస్తున్న వర్షాలకు మూడు షిఫ్ట్‌లకు రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చొప్పున రెండు రోజులకు 10 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రోజుకు 20 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ చొప్పున రెండు రోజులకు40 వేల క్యూబిక్ మీట ర్ల ఓబీ పనులకు అంతరాయం జరిగినట్లు తెలిపారు. దీని వలన బొగ్గు రవాణా కూడా నిలిచిపోయిందని తెలిపారు.
ఇల్లందు : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి జెకె ఓసీలో వరద,బ ురదతో బొగ్గుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధ, గురువాల్లో బొగ్గుత్పత్తి జరగలేదు. ప్రధానంగా ఓసిల్లో వర్షానికి బురద ఉండటంతో డంపర్లు నడపడం కష్టం. బురదలో కూరుకుపోతాయి. దీనికి తోడు వర్షం నీరు ఓసిల్లో ప్రవహిస్తోంది. దీంతో వర్షాకాలంలో ఓసిలు అంతంత మాత్రమే పనిచేస్తాయి. రోజు సుమారు 6వేల టన్నుల బొగ్గు, 18వేల క్యూబిక్‌లు ఓవర్ బర్డెన్ వెలికితీత జరిగేది. వర్షం మూలంగా నిలిచిపోయింది. కోయగూడెం ఓసీలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో సింగరేణికి రూ.కోట్లలో నష్టం జరిగినట్లు తెలిసింది.