Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
గత ఎండాకాలం సీజన్లో తారం పేరుతో క్వింటాకు 10 కేజీల పైన ధాన్యం డబ్బులకు రైతులకు తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. గురువారం ములకలపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లర్లు రైతుల నుండి దోపిడీ చేసిన సోమ్మును వెంటనే ఇవ్వాలన్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతులు బాదలుపడుతుంటే రైతుల ధాన్యం మిల్లర్లు తారం పేరుతో క్వింటాకు 10 కేజీలు దోచుకోవడం బాధాకరం అన్నారు. నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను దళారీలనుండి కాపాడాల్సింది పోయి దళారీలకు రైతులను బలిచేయడం హేయమైన చర్య అన్నారు. పాలక పెద్దలకు ఈ రకమైన దోపిడీ కనిపి ంచకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే సంబదిత అధికా రులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా మిల్లర్లు దోచుకున్న రూ.12 కోట్ల రైతుల సోమ్మును వెంటనే వారి ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జరగబోయే చలో కలక్టరేట్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్శి వూకంటి రవికుమార్, సోయం వీరస్వామి, వర్షా శ్రీరాములు ,బైరు ప్రసాద్, బోర్ర జోగయ్య, హేమనీ, శ్రీదేవి, గడ్డం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.