Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
మున్నేరు వరద ప్రవాహాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పరిశీలించారు. మున్నేరు పరిసర ప్రాంతం బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్ లోతట్టు ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు చేసారు. వరద ఉదతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వరద ప్రవాహం పెరిగే క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలన్నారు. నీటి ప్రవాహాన్ని పరిసర ప్రాంత ఆవాసాలను కలెక్టర్ పరిశీలించారు. పై ప్రాంతాల నుండి వరద ప్రవాహం ఏమేరకు పెరిగే పరిస్థితులను అనునిత్యం సమీక్షించాలని, ప్రవాహంతో పరిసర ప్రాంత ప్రజల ఆవాసాలకు నీటి ప్రవాహంచేరుకునే అవకాశం ఉన్నట్లయితే వారిని వెంటనే అప్రత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, ఇర్రిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరు శంకర్‌నాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంధ్రనాథ్, ఆర్భన్ తహశీల్దారు శైలజ, కార్పోరేటరు మాటేటి అరుణ, నాయకులు మాటేటి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.