Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందుకేనా కాంట్రాక్టర్ను సన్మానించింది..?
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మంలోని కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.డీ జావిద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో రెండు రోజుల వర్షానికి ఖమ్మం కొత్తగా నిర్మించిన బస్టాండ్ ప్రహరీ గోడలు ఎక్కడి కక్కడ పగుళ్ళు వచ్చాయన్నారు. నాసిరకం పనులుతో త్వరగా పూర్తి చేశారని, దీని కోసం మళ్లీ కేటీఆర్ ముందు ఈ జిల్లా మంత్రి అజరు కుమార్ అనుకున్నదానికంటే తొందరగా నిర్మాణం చేశారని కాంట్రాక్టర్ని శాలువాలు, బొకేలతో సన్మానించారు. ఇప్పుడు ఈ పొరపాటు ఎవరిది అని ప్రశ్నిం చారు. బస్టాండ్ పనుల్లో కమిషన్లు దొబ్బిన అధికారులదా, పనులు చూడని మంత్రిదా... నాసిరకం నిర్మాణం చేసి తొందరగా పూర్తిచేసిన కాంట్రాక్టర్దా అని ప్రశ్నించారు. ఈరోజు గోడలు రేపో ఎల్లుండో మొత్తం బస్టాండ్ పరిశీలిస్తామని.. నాయకు లతో కార్యకర్తలతో కలిసి వెళతామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వరరావు , మిక్కిలినేని మంజుల, రఫీ దా బేగం, ముస్తఫా, జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేందర్, యూత్ కాంగ్రెస్ జెర్రిపోతుల అంజని తదితరులు పాల్గొన్నారు.