Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్స్‌లు
- అదే స్ఫూర్తితో నేడు మొక్కలు నాటాలి
- మంత్రి పువ్వాడ పిలుపు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
24/7 ప్రజలకు అందు బాటులో ఉండే వ్యక్తి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ పేర్కొన్నారు. ఏడో నెల, 24వ తేదీన ఆయన జన్మిం చారని, రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్న వ్యక్తి తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే అదీ కేటీఆర్ మాత్రమే అన్నారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు శనివారం చేపట్టనున్న 'ముక్కోటి వృక్షార్చన' కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిం దిగా మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక వీడీవోస్ కాలనీలోని క్యాంప్ కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. క్రితం సారి బర్త్‌డే సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వాస్పత్రులకు ఒకేరోజు పెద్దమొత్తంలో అంబులెన్స్‌లు సమకూర్చారన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హౌర్డింగ్‌లు పెట్టి కార్యకర్తలు ఎవరూ డబ్బులు వృథా చేసుకోవద్దని కేటీఆర్ తెలిపినట్లు చెప్పారు. వాటి బదులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్ష బాధ్యత తీసుకోవాలని ఈ పుట్టిన రోజు సందర్భంగా సూచించినట్లు తెలిపారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులకు వంద ట్రైమోటార్ సైకిల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన పిలుపు మేరకు తాను 50 ట్రైమోటార్ సైకిల్స్ శనివారం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరిం చుకుని మూడు లక్షల మొక్కలు నాటాలని మంత్రి పిలుపు నిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, డిప్యూటీ మేయర్ పాతిమా జోహారా, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండల పార్టీ అధ్యక్షులు కుర్రా భాస్కర్‌రావు, నగరపార్టీ అధ్యక్షులు కమర్తపు మురళి తదితరులు పాల్గన్నారు.