Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ అన్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందన్నారు. కాల్వఒడ్డు మున్నేరు పరివాహక ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం మంత్రి సందర్శించి అధికారులకు పలు ఆదేశాలు చేశారు. ఖమ్మం జిల్లాలో వరదల వల్ల ఎటువంటి నష్టం సంభవించకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలకు జిల్లా యంత్రాగాన్ని ఆదేశించామన్నారు. . ఖమ్మం నగరంలో మున్నేరు శుక్రవారం ఉదయం 18 అడుగుల నీరు ప్రవహిస్తుందని తెలిపారు. ఇప్పటికే మున్నేరు పరిసర ప్రాంతాలైన బొక్కలగడ్డ, సారథీనగర్, జూబ్లీపుర ప్రాంతాల ప్రజలను నయాబజార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. వారికి భోజన, వసతి సదుపాయాలు కల్పించామని మంత్రి తెలిపారు. జిల్లాలో చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాలలో ప్రజలు ఎటువంటి ప్రయాణాలు చేయొద్దన్నారు. వాగులు, ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న చోట దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. జిల్లాలో వరదల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్ల లేదని తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆదేశించామన్నారు. లోతట్టు, ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి వర్షం లేదు కాబట్టి వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేసామన్నారు. భద్రాచలంలో వరద సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరు జి. శంకర్ నాయక్, స్థానిక కార్పొరేటర్ మాటేటి అరుణ, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరీ, సంబంధిత అధికారులు ఉన్నారు.