Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మభ్యపెట్టే పథకాలతో ప్రయోజనం లేదు
- దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలి
- పోరాటాలే పోడుకు పరిష్కారం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కారేపల్లి
ప్రజలను మభ్యపెట్టే పథకాలు కాకుండా పేదల జీవితాల్లో వెలుగునింపే పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో సీపీఐ(ఎం) శాఖా మహాసభ దాసరి మల్లయ్య, సర్పంచ్ బానోత్ బన్సీలాల్, తేజావత్ చందర్ అధ్యక్షతన జరిగింది. ఈసభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం గతంలో ప్రకటించిన మూడెకరాల సాగు భూమి పథకంలా నీరుకార్చవద్దన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం వాటిని మరవటం కేసీఆర్కు అలవాటే అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సేవలో తరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ సంస్ధల ప్రయివేటీకరణ, పెట్రోలియం ధరల పెంపు భారం ప్రజలపై తీవ్రప్రభావం పడనుందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కేసీఆర్ పోడు సాగుదారులకు హక్కులు కల్పిస్తామన్న హామీ అమలు చేయక పోవటంతో ఏజన్సీలో గిరిజనులను ఫారెస్టు అధికారుల నిర్భంధాలకు గురి చేస్తున్నారన్నారు. పోడుకు శాశ్వత పరిష్కారం చూపటం ద్వారానే గిరిజనులు నిశ్చింతగా వ్యవసాయం చేసుకోగల్గుతారన్నారు. పోరాటాల ద్వారానే పోడును దక్కించుకోగలమన్నారు. పోడుపై ఫారెస్టు నిర్భాంధాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయనున్నట్లు తెలిపారు. మహాసభలలో సింగరేణి సోలార్ ప్లాంట్లో భూనిర్వాసితులకు, స్ధానికులకు అవకాశం కల్పించాలని, సింగరేణి ప్రభావిత గ్రామాల అభివద్దికి సింగరేణి సంస్ధ ప్రతి ఏడాది నిధులు కేటాయించాలని, సీతారాంపురం నుండి ఉసిరికాయలపల్లి ఓసీ వరకు డబల్ బీటీ రోడ్ నిర్మించాలని తీర్మానం చేశారు. మహాసభల ప్రారంభసూచకంగా పార్టీ పతాకాన్ని అవిష్కరించి అమరులకు నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, పోతురాజు పుల్లయ్య, పచ్చిపాల, సోమయ్య, వెంకన్న, భూక్య రమేష్, మూడు హంకా, భూక్యా హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.