Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా ప్రారంభం
నవతెలంగాణ- సత్తుపల్లి
హరితహార కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షల వ్యయంతో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వనంతో వివిధ రకాల పూల మొక్కలతో పాటు చిన్న పిల్లలు ఆడుకునేందుకు జారుబల్ల, ఊయలను ఏర్పాటు చేశారు. మార్నింగ్ వాకింగ్ చేసేందుకు కూడా పార్కులో చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పట్టణ ప్రజలు సేద తీరేందుకు గ్రీనరీని వనం మధ్యలో ఏర్పాటు చేశారు. ఈ వనంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. వనంలో ప్రతి మొక్కకు నీరు అందించేందుకు డ్రిప్ ఏర్పాటును సైతం ఏర్పాటైంది. వర్షాలు కురిసిన సందర్భాల్లో పార్కులో నీరు నిలువకుండా అండర్ పైపులైనును మెయిన్ డ్రైనుకు కలిపారు.
నేడు ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా ప్రారంభం...
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పాల్గొననున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర నిర్మాణంలో ఉన్న పార్కును పరిశీలించారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, ప్రజలు సేద తీరేందుకు సౌకర్యవంతంగా ఉండాలని కొన్ని సూచనలను మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్‌కు, కమిషనర్ సుజాత సూచించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు అద్దంకి అనిల్‌కుమార్, రాఘవేంద్ర, నాగుల్‌మీరా, దేవరపల్లి ప్రవీణ్, నాయకులు వల్లభనేని పవన్, మల్లూరు అంకమరాజు, గఫార్ కంటె అప్పారావు, పాలకుర్తి రాజు పాల్గొన్నారు.