Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసర డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి
- కార్మిక సంఘాల ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం
నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం రక్షణ రంగ పరిశ్రమలను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు అమ్మే ప్రయత్నాన్ని విరమించుకోవాలని శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, ఐయన్ టియుసి జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు, ఐయఫ్టియూ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, టీఆర్ఎస్ కె వి జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణలు మాట్లాడుతూ చివరికి దేశ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరించి విదేశీ శక్తుల చేతుల్లో పెడుతున్నారని, దీని వలన దేశ రక్షణ వ్యవస్థకు పెను ముప్పు వాటిల్లినుందన్నారు..కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే 81 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, నష్టపోతారని అన్నారు. రక్షణ శాఖకు చెందిన నలభ్కె నాలుగు విభాగాలను ఏడు కార్పొరేషన్లుగా విడగొట్టి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారన్నారు. రక్షణ రంగానికి 70 వేల ఎకరాలకు పైగా వివిధ పట్టణాల్లో భూములున్నాయని, అదానీ, అంబానీలకు వాటిపై కన్ను పడిందని, కేంద్ర ప్రభుత్వం వారి చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు.. రక్షణ రంగం ప్రైవేటీకరణను అందులోని ఉద్యోగులు, కార్మికులు దాన్ని రక్షించుకునేందుకు సమ్మె పోరాటాలకు సిద్ధమయ్యారని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా సమ్మె నిషేధ ఉత్తర్వులు ఇచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోందని,. కేంద్ర ప్రభుత్వ చర్యలను దేశంలోని కార్మిక వర్గం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని రక్షణ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని అత్యవసర డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు . కార్యక్రమంలో సిఐటియు నాయకులు నవీన్‌రెడ్డి, రమణ, కాంపాటి వెంకన్న, అమరావతి, గోపాల్‌రావు, ఐఎన్టియుసి నాయకులు కె.భద్రయ్య, ఎఐటియుసి నాయకులు పి.మోహన్‌రావు, షేక్ ఇబ్రహీం, బోడా వీరన్న, షేక్ చానా, టి.నాగమణి, ఐఎఫ్టియు నాయకులు ఎ.రామారావు, కె.శ్రీనివాస్, నాగయ్య, లక్ష్మినారాయణ, గురవయ్య, పటేల్, టిఆర్ఎస్ కెవి నాయకులు షేక్ సత్తార్, సిల్వరాజ్,చిన్ని, చారి పాల్గొన్నారు.