Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదిశాతం మంది దేశ జనాభాకు కూడా రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి..?
- లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామ ప్రశ్న
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
వ్యాక్సిన్(టీకా) తయారీలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఇండియాలో పదిశాతం మంది దేశ జనాభాకు కూడా రెండవ దశ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి..? అసలు దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిని ప్రశ్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ నామ శుక్రవారం కోవిడ్‌కు సంబంధించి పలు కీలక అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ 20 జూలై 2021నాటికి గాను 18ఏండ్ల వయసుపై బడిన వారికి మొత్తం 34.5శాతం మందికి తొలిదశ వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామన్నారు. ఇదే తేదీనాటికి భారతదేశ వ్యాప్తంగా మొత్తం 2.15లక్షల కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల ద్వారా 32.64 కోట్ల మందికి మొదటి డోస్, 8.55 కోట్ల మందికి రెండో డోస్ వ్యాక్సిన్‌ను అందించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అదేవిధంగా భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్‌కు కొరత లేదనీ, 18ఏండ్లు పైబడిన వారికి అందించే వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగానే దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా ప్రజలకు అందజేస్తున్నామని నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.