Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ బదిలీల షెడ్యూలు విడుదల చేయాలి
- టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి రాము
నవతెలంగాణ-ఇల్లందు
గత మూడు సంవత్సరాల నుండి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు బదిలీలు చేయడం లేదని, వెంటనే బదిలీల షెడ్యూలు విడుదల చేయాలని టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి పొట్టపింజర రాము కోరారు.జోనల్ కార్యాలయంలో గురువారం జరిగిన మండల సబ్ కమిటీ సమావేశములో మాట్లాడుతూ మారుతున్న ఉపాధ్యాయుల అవసరాల మేరకు డిప్యుటేషన్లు అన్నీ రద్దు చేసి, బదిలీలు నిర్వహించాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నటువంటి సుమారు ఎనిమిది మంది ప్రధానోపాధ్యాయులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారని వారికి మౌఖికంగా డిప్యూటేషన్ల ఆర్డర్లు ఇవ్వడం విచిత్రంగా ఉందని అన్నారు. కొందరు పైరవికారులు (నాయకులు) బదిలీలను, అక్రమ డిప్యూటేషన్లను వ్యతిరేకిస్తున్న వారిని విమర్శిస్తున్నారని ఆ నాయకులు ఉపాధ్యాయులు పక్షమా లేక అధికారుల పక్షమా అని ఉపాధ్యాయులు నిలదీయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు గోగ్గల సమ్మయ్య, బోడ నాగు, కిషన్, రాజన్న, శ్రీను, పూర్ణిమ వెంకట్ రాములు రమేష్, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు పారదర్శకంగా నిర్వహించాలని టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బి.రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం లకీëనగరం కె.రేగుబల్లి బాలికల వసతి గృహంలో జరిగిన ఆ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఉపాద్యాయ సంఘం నాయకులు ఎల్ భాస్కర్, నరేందర్, జె. భద్రు తదితరులు ఉన్నారు.
ఆళ్ళపల్లి : గత మూడేండ్లుగా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించబడలేదని, వెంటనే బదిలీల, ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని అనంతోగు బాలికల ఆశ్రమ పాఠశాలలో టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి చాట్ల శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కె.లక్ష్మినారాయణ, వసంత, పద్మ పాల్గొన్నారు.