Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగిన వాగులు, వంకలు
- జలకళతో అన్నదాతలో ఆనంద హేల
- నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్టు
- ఏడు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 8223 క్యూసెక్కుల నీరు విడుదల
నవతెలంగాణ-చర్ల
వాతావరణంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని ఈత వాగు, పడదలమ్మ గండి, చింతకు ంట చెరువు, పెద్ద చెరువు, మొగుళ్లపల్లి చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎటు చూసినా జలకళతో సముద్రాన్ని తలపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు భానుడి తాపంతో విలవిలలాడిన అన్నదాతలు అల్పపీడన ద్రోణితో కుండపోత వర్షాలతో ఆనందడోలికల్లో తేలి ఆడుతున్నారు.
నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్టు
నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్టు సంతరించుకుంది. ఏడు గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 8223 క్యూసెక్కుల నీటిని అధికారుల దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న ఛత్తీస్గడ్ దండకారణ్య ప్రాంతం నుంచి ప్రాజెక్టు రిజర్వా యర్‌లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికా రులు, సిబ్బంది అప్రమత్తమై గంటగంటకూ పెరుగు తున్న నీటి ఉధృతిని అంచనా వేస్తూ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 7155 క్యూసెక్కుల నీరు (ఇన్‌ఫ్లో) వస్తున్నట్లుగా తాలిపేరు డీఈఈ తిరుపతి తెలిపారు. ప్రాజెక్టు క్రస్ట్ లెవల్ 69 మీటర్లు. 74 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ప్రస్తుత వరద ఉధృతిని బట్టి 72.32 మీటర్ల నీటిని నిల్వచేస్తూ, అదనపు నీటిని గేట్లుఎత్తి దిగువకి విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లో గంటగంటకు వరద పెరుగుతోంది.