Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూసీ, సీఐటీయూ, ఏఐకెఎస్
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్పొరేట్, బడా పెట్టుబడిదారుల నుండి వారికి ఊడిగం చేస్తున్న పాలకుల నుంచి క్విట్ ఇండియా స్ఫూర్తితో భారత దేశాన్ని కాపాడుకుందామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. సాయిబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం మంచికంటి మీటింగ్ హాల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్పూర్తితో సేవ్ ఇండియా అనే అంశంపై సమావేశం జాటోత్ కృష్ణ, కున్సోత్ ధర్మా, యంవి.అప్పారావుల అధ్యక్షతన జిల్లా సదస్సు జరిగింది. ఈ సంద్భంగా సాయిబాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో భారత దేశంలో సంపద స్రృష్టిస్తున్న వ్యవసాయ కూలీల కార్మికుల, కర్షకులకు వ్యతిరేక విధానాలను పాలకులు రూపొందిస్తున్నారని, బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల లాభాలు పెంచడం కోసం దేశ సంపదను కట్టబెట్టడం కోసం పార్లమెంటు సాక్షిగా చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. గత సంవత్సర కాలంగా రైతులు ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తుందన్నారు. కరోనా కాలంలో కార్పొరేట్ శక్తుల ఆస్తులు 10 రెట్లు పెరిగాయని, ఈ సంపద ప్రజల వద్ద నుంచి దరలు పెంచి దోపిడీ చేయడం వల్ల పెరిగిందన్నారు. దేశ సంపద అయిన బొగ్గు గనులు, ఇందనం, రైల్వేలు, విమానయానం, పరిశ్రమలు ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు వారికి అప్పగించారన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక, కర్షక ఐక్యతతో క్విట్ ఇండియా స్ఫూర్తితో భారత ప్రజలను, సంపదను కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. దేశాన్ని కాపాడుకునేందుకు గ్రామ స్థాయిలో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.
అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎజె.రమేష్‌లు మాట్లాడుతూ.. ఈ నెల 25, 26 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలు జరుగుతాయని తెలిపారు, 27 నుండి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని, అన్ని తరగతుల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో 3 సంఘాల నాయకులు రేపాకుల శ్రీనివాస్, నభీ, కొండపల్లి శ్రీధర్, పిట్టల అర్జున్, గూడిపుడి రాజు, నరసింహారావు, బత్తుల వెంకటేశ్వర్లు, కొండబోయిన వెంకటేశ్వర్లు, నల్లమల సత్యనారాయణ, వెంకటమ్మ, వాంకుడోత్ కోబల్, యాసా నరేష్, చిరంజీవి, అన్నవరపు సత్యనారా యణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.