Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అధికారులు వరదల పట్ల 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, భద్రాచలం వద్ద నేటిలోగా గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడం పక్కా అని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గత మూడు రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, చత్తీష్ ఘడ్లో కురుస్తున్న భారీ వర్షాలకు లకీëబ్యారేజ్ (మేడిగడ్డ) సమ్మక్క బ్యారేజ్ (తుపాకులగూడెం) నుండి సుమారు 25 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నారని, దీని వలన గోదావరి పెరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన గోదావరి ముంపు ప్రాంత ప్రజల కోసం లకీëనగరంలోని కె. రేగుబల్లి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాసా కేంద్రాన్ని ఆయన పరీశీలించి ఏర్పాట్లపై తహశీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన గోదావరి ముంపు గ్రామమైన సున్నంబట్టి వెళ్లారు. అధిక వర్షాలకు, గోదావరి వరదలకు నిత్యం ముంపుకు గురయ్యే బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాల మద్య గల చప్టాను పరీశీలించారు. భద్రాచలం వద్ద ఏ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే సున్నంబట్టి గ్రామం ముంపుకు గురి అవుతుందని అధికారులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. రేపటిలోగా గోదావరి పెరిగే ప్రమాదం ఉందని రహదారికి రెండు వైపులా బారీ కేడ్లు ఏర్పాటు చేయాలని రెవిన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటూ పర్యవేక్షించాల న్నారు. అవసరమైతే గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించడంతో పాటు సున్నంబట్టి గ్రామంలో ఎవరైనా గర్భీణీలు ఉన్నారా అని వైద్యుడు బాలాజీ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులతో పాటు ఫాగింగ్ చేయించాలని ఎంపీఓ ముత్యాలరావును ఆదేశిం చారు. నిత్యం వరద తాకిడికి గురి అవుతున్న సున్నంబట్టి రహదారి వరద తాకిడికి గోతుల మయంగా తయారైందని గతంలో ముంపు పరీశీలనకు వచ్చిన అప్పటి జిల్లా కలెక్టర్ ఎంవి.రెడ్డి మరమ్మతులు చేపించాలని అధికారులను ఆదేశించి నప్పటికీ నేటికీ మరమ్మతులు చేపట్టలేదని ప్రగళ్లపల్లి ఎంపీటీసీ మడకం రామారావు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు.
దుమ్ముగూడెం చిన్నలాకుల వద్ద గోదావరి కరకట్ట ప్రమాద కరంగా ఉందని విలేఖ రుల ద్వారా తెలుసుకున్న ఆయన దుమ్ముగూడెం వెళ్లి కరకట్టను పరీశీలించారు. అక్కడే ఉన్న పీటి పారుదల శాఖ జేఈ రాజ్ సుహాస్ రైతులు వ్యవశా య పనుల కోసం లంక మీదకు వెళ్లడానికి కట్టను తగ్గించడంతో పాటు ఎల్అండ్టీ వారు సైతం కట్టను తగ్గించారని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన నీటి పారుదల శాఖ ఎస్సి వెంక టేశ్వరరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో కట్టను పర్తి స్తాయిలో పటిష్టం చేయాలని ఆదేశిం చారు. ఆయన వెంట తహశీల్దార్ వర్షా రవికుమార్, ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి, సీఐ నల్లగట్ల వెంక టేశ్వర్లు, ఏఓ నవీన్, విద్యుత్ శాఖ ఏఈ రోహిణి, ఎంపీఓ ముత్యాలరావు, ఆర్ఐ ఆదినారాయణ, ప్రగళ్ల పల్లి, దుమ్ముగూడెం సర్పంచ్‌లు జుంజురి లకీë, మడి రాజేష్ తదితరులు ఉన్నారు.