Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని దామరతోగు గ్రామానికి చెందిన చెన్నూరి శ్రీను ఇటీవల కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయిన విషయం తెలిసిందే! కాగా శుక్రవారం దశదిన కర్మలు జరపగా అందుకు సాయనపల్లి ఎంపీటీసీ కల్తి క్రిష్ణారావు మరి కొందరితో కలిసి శ్రీను కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీను అతి చిన్న వయసులోనే కిడ్నీల సమస్యతో చనిపోవడం బాధాకరమన్నారు. శ్రీను మరణంతో భార్యా, ఇద్దరు చిన్న పిల్లలు ఇంటి పెద్దను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుతారి వెంకటయ్య, కల్తి హరికృష్ణ, మున్నా, అరెం దశరథ్, నగేష్, కల్తి రఘు, శ్రీను, సాంబయ్య, వూకె నగేష్, కల్తి ముత్తయ్య, మొక్కటి గోపి, కొమరం శ్రీను, సుతారి ఆదినారాయణ, రామస్వామి, కల్తి శ్రీక్రిష్ణ, వార్డు మెంబర్ క్రిష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.