Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదింట డబ్బులేక ఆగిన వైద్యం
- గత 5 నెలలుగా లివర్ డ్యామేజ్‌తో బాధపడుతున్న లావణ్య
- వైద్యం కోసం రూ.8 నుంచి 10 లక్షలు అవసరం
- దాతల కోసం ఎదురు చూపు
నవతెలంగాణ-ముదిగొండ
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బంక లావణ్య (20) గత మూడు మూడు నెలలుగా లివర్ డ్యామేజ్ (హార్ట్ ప్రాబ్లమ్)తో బాధపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా లావణ్య వైద్యం కోసం డాక్టర్లు రూ.8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. కటిక పేదరికులు కావడంతో అంత డబ్బు లేక, వైద్యం చేయించ లేక ఆమె తల్లిదండ్రులు సైదులు ఇందిర దాతల కోసం ఎదురు చూస్తున్నారు. వైద్యం కోసం సంపాదించుకున్న కొంత డబ్బు కూడా ఖర్చు చేసినట్టు వారు తెలిపారు. ఇప్పటికే అన్ని హాస్పిటల్స్ తిప్పినట్టు తల్లిదండ్రులు రోధిస్తూ తెలిపారు. లావణ్య వైద్యం కోసం దాతల సాహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బంక లావణ్య ఫొన్‌పే, గుగుల్‌పే నెంబర్ 9704948311 కు దాతలు డబ్బు పంపించి పాపని కాపాడాల్సిందిగా వేడుకుంటున్నారు.