Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస-రైతు-టీయూ నాయకులు పొన్నం, మాదినేని, విష్ణులు పిలుపు
నవతెలంగాణ-గాంధీచౌక్
క్విట్ ఇండియా డే ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా ఉద్యమాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చిందని మరో దేశ రక్షణ ఉద్యమానికి సిద్ధం కావాలని వ్యకాస-రైతు-టీయూ సంఘాల జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వర రావు, మాదినేని రమేష్, తుమ్మా విష్ణు వర్దన్ లు పిలుపు నిచ్చారు. స్థానిక సిఐటియు త్రీటౌన్ కార్యాలయంలో పాశం సత్యనారాయణ అధ్యక్షతన సీఐటియు విస్తృత సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సందర్భంగా మూడు సంఘాల జిల్లా బాధ్యులు మాట్లాడుతూ దేశంలో విచ్చలవిడిగా ప్రజా ఆస్తుల అమ్మకం, రాజ్యాంగ బద్ద హక్కుల హరింపు, శ్రమ దోపిడీ, అన్ని రంగాలను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టె చర్యలు మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తుందన్నారు. ఈ చర్యల నుండి దేశాన్ని రక్షికోవడానికి మూడు సంఘాల జాతీయ కమిటీలు ఆగష్టు 9వరకు ఐక్య కార్యాచరణకు సేవ్ ఇండియా ఉద్యమానికి పిలుపు నిచ్చాయని ఈ పిలుపు లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, టీయూడీిఎఫ్ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీనివాసరావు, సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తుశాకుల లింగయ్య, నాయకులు బండారు యాకయ్య, భూక్య శ్రీనివాసరావు, యస్కె సైదులు, వేల్పుల నాగేశ్వర రావు, కొట్టె అలివేలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.