Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లెక్సీని బ్లేడ్‌తో కోసినా వైనం
- మండిపడుతున్న కార్యకర్తలు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం పట్టణంలోని త్రీటౌన్ ప్రాంతంలో స్థానిక పంపింగ్‌వెల్ రోడ్డులో గత కొన్ని సంవత్సరాలుగా ఆషాడమాసంలో పెద్దమ్మ తల్లి గుడి వద్ద బోనాల పండగ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బోనాల కార్యక్రమంలో బాగంగా శనివారం రాత్రి 1 వరకు ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు కట్టారు. పెద్దమ్మ తల్లి గుడి ఎదురుగా 'మంత్రి అజరు కుమార్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ కట్టారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున మంత్రి ఫ్లెక్సీని బ్లేడ్‌తో పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ పని చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా గాని వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని 34వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
మా అజరు అన్నకే రక్షణ లేకపోతే మాలాంటి సామాన్య వాళ్లకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. ఆదివారం ప్లెక్సీని పరిశీలించిన వారిలో పార్టీ కార్యకర్తలు కీర్తి నాగరాజు, కీర్తి హరీష్, మల్లేశం, పరుశరామ్, గోల్డ్ రాంబాబు సర్దార్, శ్యామ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.