Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత రాజకీయాల్లోకి రావాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
క్విట్ ఇండియా స్ఫూర్తితో త్వరలో సేవ్ ఇండియా ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని తెల్దారు పల్లి, కోట నారాయణ పురం, పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం 17వ శాఖ గ్రామాల మహా సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టాక దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యాడన్నారు. భారత దేశాన్ని కాపాడేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సేవ్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శులకు, కన్వీనర్లకు, సోషల్ మీడియా ఇంచార్జ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకులు బందెల వెంకయ్య,పి. మోహన్ రావు,ఉరడీ సుదర్శన్ రెడ్డి,పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ,ఏటుకూరి ప్రసాద్ రావు,తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య,ఆంధ్ర బ్యాంక్ వైస్ చైర్మన్ తమ్మినేని విజయలక్ష్మి, సిపిఎం నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు, కమలమ్మ, రంజాన్, సుమతి, పట్టాభి, నగేష్ పాల్గొన్నారు.