Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ఉధ్యమాలకు సిద్ధ పడాలి
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
కమ్యూనిస్టుపార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మూడేండ్ల కాలంలో జరిగిన లోటుపాట్లను భవిష్యత్ కార్యాచరణ రూపొందించు కోవడానికి శాఖ మహాసభలు ఒక వేదికగా ఉంటాయని భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యు లు డాక్టర్ మిడియం బాబూరావు అన్నారు. ఆదివారం 14వ వార్డులోని కొత్త కాలనీ ఏ, బీ శాఖ మహాసభల సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరి ంచి ఆయన మాట్లాడుతూ పార్టీకి గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమాల ధ్యేయంగా ప్రతి కార్యకర్త నిలవాలని ఆకాంక్షించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని దాని ఫలితంగానే కరోనా రెండో దశ అంతగా విస్తరించి, లక్షలాది మందిని బలిగొన్న దని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల కు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యం.బీ.నర్సారెడ్డి అధ్యక్షత వహించగా, అమరజీవి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కాలనీలో మహాసభలను కాంక్షిస్తూ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యలో అమరజీవి తోటకూర స్థూపానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్, జిల్లా కమిటీ సభ్యురాలు యం.రేణుక, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట రెడ్డి, వార్డు కన్వీనర్ సంతోష్ కుమార్, ఆర్సీ కమిటీ సభ్యులు సీతామాలక్ష్మి, కుసుమ, చుక్క మాధవరావు, స్థానిక నాయకులు సతీష్ బాబు, శ్రీను, రాజేంద్ర, వెంకటరమణ, రమణ, సత్యవతి, సరోజిని, జయ లక్ష్మి, ఈశ్వరరావు పాల్గొన్నారు.