Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం వద్ద తగ్గుతున్న వరద
- ఊపిరిపీల్చుకున్న అధికారులు, నది పరివాహక ప్రాంత ప్రజలు
- మొదటి, రెండవ ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన గోదావరి వరద ఆదివారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలను, అధికారులను ముప్పతిప్పలు పెట్టిన గోదావరి ఆదివారం శాంతించింది. ఆదివారం ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక దాటి 49.80 అడుగుల వరకు ప్రవహించింది. ఒకానొక దశలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 58 అడుగుల వరకు చేరుకుంటుందని ప్రచారం జోరుగా సాగడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోయారు. క్రమక్రమంగా తగ్గుతూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 41 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం డివిజన్లోని భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ అనుదీప్ మొదటి, రెండవ ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లోని ఉన్న వరద బాధితులకు అధికార యంత్రాంగం భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.