Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం మూడు యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి కావడంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో మణుగూరు గనుల నుండి బీటీపీఎస్‌కు బొగ్గు రవాణా అధికమైంది. వర్షాకాలం కావడంతో బొగ్గు నిల్వలు తగ్గడంతో కొద్ది రోజుల కిందట జెన్కొ అధికారులు, సింగరేణి అధికారులతో సమావేశమై బొగ్గు రవాణా పెంచాలని, రెండు సంస్థల పరిధిలో బొగ్గు రవాణా లోటుపాట్లను సరిదిద్దాలని నిర్ణయించారు. దీంతో సింగరేణి నుండి క్రమేణ బీటీపీఎస్‌కు బొగ్గు రవాణా పెరుగుతుంది. 1080 మెగావాట్ల సామర్ధ్యం కల్గిన బీటీపీఎస్‌లో మూడు యూనిట్ల నుండి ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. గత నెల వరకు రోజుకు 60 లారీల చొప్పున 7వేల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేసేది. ప్రస్తుతం బొగ్గు వినియోగం పెరగడంతో రోజుకు 120 లారీల బొగ్గు చొప్పున 14వేల టన్నులు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా బీటీపీఎస్‌కు జి9 నాణ్యత కల్గిన బొగ్గు అవసరం వుంటుంది. అయితే జి7, జి13 నాణ్యత కల్గిన బొగ్గును కూడా రవాణా చేస్తున్నారు. జి7, జి13 నాణ్యత కల్గిన బొగ్గు మిశ్రమాన్ని ఎప్పటికప్పడు సంబంధిత అధికారులు పరిశీలిస్తు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. సరుకు రవాణా పెరగడంతో స్టాక్ యార్డులో నిల్వలు పెరిగాయి. గతంలో 25వేల టన్నుల మాత్రమే వుండడంతో బీటీపీఎస్‌కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని గమణించి జెన్కొ అధికారులు సీఈ బాలరాజు నేతృత్వంలో సత్వర చర్యలు చేపట్టడంతో నిల్వలు 70 వేల టన్నుల వరకు పెరిగాయి. వర్షాకాలంలో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరిగే పరిస్థితి వుండదు. దీంతో రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముందస్తుగా బొగ్గు నిల్వలు పెంచుకొని విద్యుత్ ఉత్పత్తికి అవరోధాలు లేకుండా జెన్కొ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీటీపీఎస్‌కు మూడేళ్ల కాలంలో 3.13 వేల టన్నుల రవాణా అయింది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన మొదటి ఏడాది 2019-20లో 40వేల టన్నుల బొగ్గును రవాణా చేశారు. 2020-21లో 22లక్షల టన్నులు ఈ యాడాదిలో 8.50 లక్షల టన్నుల రవాణా చేశారు. నాల్గొ యూనిట్ సివోడిని సెప్టెం బర్లో నిర్వహించాలని జెన్కొ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నాల్గొ యూనిట్ నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే ఈ ఏడాది చివరి కల్లా 51లక్షల టన్నుల బొగ్గు బిటిపిఎస్‌కు రవాణా అవుతుంది. సింగరేణి, జెన్కొ సంస్థల సమన్వంతో బొగ్గు రవాణా చేసే లారీల సంఖ్యను పెంచడం, లోడింగ్, ఆన్ లోడింగ్‌ను వేగవంతం చేయడం రవాణా సులభంగా జరిగేలా అధికారులు నిరంతరం పరివేక్షిస్తున్నారు.