Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీవో సూర్యనారాయణ
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆరు మండలాల్లో 2720 మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల డివిజన్ పరిధిలో గల ఆరు మండలాల్లో కార్డులు సోమవారం నుండి పంపిణీ కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో 3523 మంది రేషన్ కార్డులు కావలని దరఖాస్తులు చేసుకున్నారు. ఆరు మండల్లో రెవిన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేసి 803 మంది దరఖాస్తులను అన్హరులుగా తిరస్కరించారు. 2720 మంది అర్హులుగా గుర్తించటం జరిగింద న్నారు. ఏన్కూర్ మండలంలో 321 దరఖాస్తులు 87 మందిని అన్హరులుగా తిరస్కరించి 234 మందికి కార్డులు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. కల్లూరు మండలంలో 610 మంది దరఖాస్తులు చేసుకొగా 107 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా 507 మందికి కార్డులు పంపిచేయన్నుట్లు తెలిపారు. పెనుబల్లి మండలం లో 748 మంది దరఖాస్తులు చేసుకోగా 200 మంది దరఖాస్తులు తిరస్కరించగా 548 మందికి కార్డులు పంపిణి చేస్తారని తెలిపారు. సత్తుపల్లి మండలంలో 917 మంది దరఖాస్తులు చేయ్యగా 201మంది దరఖాస్తులు తిరస్కరించగా 716 మందికి కార్డులు పంపిణీ చేస్తారు. తల్లాడ మండలం లో 553 మంది దరఖాస్తులు చెయ్యిగా 128 దరఖాస్తులు తిరస్కరించగా 425 మందికి కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు. వేంసూరు మండలంలో 374 దరఖాస్తులు చేసుకోగా 84 దరఖాస్తులు తిరస్కరించగా 290 మందికి కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు. సోమవారం సత్తుపల్లి లో శాసనసభ్యులు సండ్ర వెంకట విరయ్య కార్డులు పంపిణీ కార్యక్రమని ప్రారంభించన్నుట్లు తెలిపారు.