Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిద్దాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రాజారావు
నవతెలంగాణ-పాల్వంచ
పెట్టుబడిదారులకు లాభాలు చేకూరుస్తూ కార్మిక చట్టాలను సవరిస్తూ కట్టు బానిసలుగా చేస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పి.రాజారావు అన్నారు. పట్టణం హమాలి వృత్తి శాఖ మహాసభను వారు ప్రారంభించారు. స్థానిక హామాలి కాలనీలో మహాసభ నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికగా పతాక ఆవిష్కరణ సీనియర్ సభ్యులు ఆవుల భిక్షపతి ఆవిష్కరించారు. అనంతరం మహాసభ పార్టీ సభ్యులు ఏనుగుల రాములు అధ్యక్షతన జరిగిన మహాసభలో ముఖ్యఅతిథిగా హాజరైన రాజారావు మాట్లాడారు. కేేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాయన్నారు. ఈ విధానాలపై కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని తెలిపారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి దొడ్డ.రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసే విధంగా నాలుగు లేబర్ కోడులను తీసుకు వచ్చిందన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.జ్యోతి మాట్లాడారు. అనంతరం పార్టీ జిల్లా నాయకులు అప్పారావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల బతుకులో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఈ మహాసభలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు, హమాలి శాఖ ఇన్చార్జ్ గూడెపురి రాజు, పట్టణ కమిటీ సభ్యులు మెరుగు ముత్తయ్య, కే.సత్య, వాణి, రహీం, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, పార్టీ శాఖ కార్యదర్శి గట్టయ్య, సభ్యులు పాల్గొన్నారు.