Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మకం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.రాజారావు
నవతెలంగాణ-పాల్వంచ
బీజేపీ విధానాలపై పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.రాజారావు అన్నారు. స్థానిక అల్లూరి సెంటర్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎండీసీ వృత్తి శాఖ మహాసభ సీనియర్ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ వెంకట్రావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్ సభ్యులు శిరంశెట్టి కాంతారావు పతాకావిష్కరణ చేశారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజారావు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తోందన్నారు. పాల్వంచలోని ఎన్ఎమ్డీసీనీ కాంట్రాక్టర్కు అప్పజెప్పాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుందని, ఈ ప్రయత్నాలు వెంటనే నిలుపుదల చేయకపోతే కార్మికుల ఐక్యం చేసి ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృత్తి శాఖలో పార్టీని బలోపేతం చేయాలని దోపిడీ లేని సమాజం కోసం కష్టజీవుల రాజ్యం కోసం పనిచేయాలన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.జ్యోతి మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కార్మికుల సమస్యలు పట్టించు కోవడం లేదన్నారు. రాబోయే కాలంలో పలు సమస్య లపై మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పార్టీ పట్టణ కమి టీ సభ్యులు గూడెపురి రాజు, మెరుగు ముత్తయ్య, వాణి, రహీం, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.