Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
ప్రజల సొమ్ము అయినా భూములను ఈ వేలం ద్వారా పెట్టుబడిదారులకు కట్టబెట్టే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్న వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖల మహాసభలు సాధినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగాయి. మహాసభల ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నాయకులు సాధినేని సారయ్య సీపీఐ(ఎం) పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన భూము లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అనంతరం పార్టీ తూటికుంట్ల ఒకటవ శాఖ కార్యదర్శిగా పాపినేని రమేష్, 2వ శాఖ శాఖ కార్యదర్శిగా పాపినేని వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ మహాసభలలో మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, మాజీ ఎంపీటీసీ గుమ్మ ముత్తారావు, సీపీఐ(ఎం) గ్రామ కమిటీ కార్యదర్శి పాపినేని అప్పారావు, నాయకులు నోముల పుల్లయ్య పాల్గొన్నారు.