Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు
నవతెలంగాణ- సత్తుపల్లి
క్విట్ ఇండియా స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు గ్రామ, మండల స్థాయిలో జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య భవన్ లో జరిగిన సీఐటీయూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల మండల స్థాయి సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పది నెలలుగా దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.సీఐటీయూ మండల కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి రావుల రాజబాబు, సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, బాల బుచ్చయ్య, నరేష్, చంటి, షేక్ కాసీం, కృష్ణవేణి, రాములు పాల్గొన్నారు.