Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తృతంగా మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శలు
నవతెలంగాణ-కొణిజర్ల
పరామర్శలు, ఓదార్పులు, భరోసాలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృత పర్యటన ఆదివారం కొనసాగింది. ముందుగా మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో ముత్యాల భాస్కర్ ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదే గ్రామానికి చెందిన పత్తి తిరుపతి రావు యాక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మలపూడి శ్రీనివాస్ దంపతులు ఇటీవలే ఆనారోగ్యం బారినపడి చికిత్సపొంది ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా వారిని పరామర్శించి వారికి తగు ఆరోగ్య సూచనలు ఇచ్చారు. మాజీ గ్రామ సర్పంచ్ చింతనిప్పు నరసింహరావు నూతనంగా ఏర్పాటు చేసిన రైతు ఆగ్రోస్ షాప్ ప్రారంభించినందున వారి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గుండ్ల ఉమేష్ నూతనంగా స్వీట్ ,టీ షాప్ ప్రారంభించడంతో శుభాకాంక్షలు తెలిపి అనంతరం మండల కేంద్రంలో బీసీ కాలనీ లో గల చర్చి ఫాదర్ నతానియేలు కుమార్తె కు ఇటీవలే వివాహం జరిగింది. దీంతో నూతన వధువరులైన నిస్సిక వినరు శుభాకాంక్షలు తెలిపి చర్చి లో ఏర్పాటు ప్రార్ధన లో పాల్గొన్నారు. అదే విధంగా పలువురిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాస్ రావు, ఎంపీపీ గోసు మధు, ఏలూరి శ్రీనివాస్ రావు, పరికపల్లి శ్రీనివాస్ రావు, దొడ్డపనేని రామారావు, చెరుకుమల్లి రవి, మధన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.