Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇఫ్య్టూ జాతీయ నాయకులు టి శ్రీనివాస్ డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు మొదటిగా క్యాటగిరి వేతనం చెల్లించాలని ఇఫ్య్టూ జాతీయ నాయకులు టి శ్రీనివాస్ సింగరేని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఇఫ్య్టూ అనుబంధం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ నాయకులు టి. శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఏ. వెంకన్న పాల్గొని మాట్లాడారు. తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డివైపిఎం కవితా నాయుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శిషేక్ యాకుబ్ షావలి, ఉపాధ్యక్షులు ఎన్.సంజీవ్, ఆర్.మధుసూదన్ రెడ్డి, పెద్ద బోయిన సతీష్, చంద్రశేఖర్, గోనెల రమేష్, సముద్రాల సత్యనారాయణ, గౌస్, రాధా, మంజు లోధ్, సుమిత్ర పాసి తదితరులు పాల్గొన్నారు.