Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కార్డులు అందచేయనున్నట్లు స్థానిక శాసన సభ్యులు లావుడ్య రాములు నాయక్ పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం కొత్తగా మంజూరైన ఆహార భద్రత కార్డులను లబ్ధిదారులకు అందచేశారు. అనంతరం తహశీల్దార్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందచేస్తనట్లు వివరించారు. ఎంపీపీ గోసు మధు, సర్పంచ్ సూరంపల్లి రామారావు, మార్కఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీడీఓ రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ రవి, వివిధ గ్రామాల సర్పంచ్ లు పరికపల్లి శ్రీను, దొండపాటి లక్ష్మీ, చిలుకూరి నాగేంద్రమ్మ, నాగేశ్వరరావు, మాన్సింగ్, సత్యనారాయణ, కమటాల రేణుక, కొర్రా కాంతి, ఎంపీటీసీ లు కోటేశ్వరరావు, అంబేడ్కర్, స్వర్ణలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై చిరంజీవి, జిల్లా నాయకులు ఏలూరి శ్రీను, జీడయ్య, పోట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.