Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెగా నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి..
- లేఅవుట్ల ఆడిట్ పకడ్బందీగా ఉండాలి
- డంపింగ్ యార్డులలో మాత్రమే
- చెత్త డంప్ అయ్యేలా చూడాలి
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులన్నీ ప్రజా అవసరాలకనుగుణంగా వినియోగంలో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ముగింపు దశలో ఉన్న పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం పథకాల అమలుపై సమీక్షించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే చేపట్టిన అభివద్ధి పనులు, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులన్నీ ప్రజల ఉపయోగార్ధం వినియోగంలో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికీ చేరాలన్నారు. ఇప్పటికే పూర్తయిన పనులతో పాటు ముగింపు దశలో ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ పబ్లిక్ హెల్త్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరంలో మెగా నర్సరీ ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్, జిల్లా అటవీ శాఖాధికారి సంయుక్తంగా స్థలాన్ని గుర్తించాలన్నారు. కనీసం 10 నుండి 15 ఎకరాల విస్తీర్ణంలో మెగా నర్సరీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నగరపాలక సంస్థ, సుడా పరిధిలోని లేఅవుట్ల ఆడిట్ పకడ్బందీగా ఉండాలన్నారు. ఒరిజనల్ డాక్యుమెంట్ల ఆధారంగా భౌతిక స్వరూపం విస్తీర్ణాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. లేఅవుట్ల ఆడిట్ల సమగ్ర నివేదికలను సమర్పించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను కలెక్టర్ ఆదేశించారు.
పల్లె, పట్టణ ప్రగతి పనులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ పల్లె ప్రగతిలో చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్స్, వైకుంఠ ధామాలు, యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాల న్నారు.. సంబంధిత అధికారులు డంపింగ్ నిరంతరం పర్యవేక్షిస్తూ వినియోగంలో ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. డంపింగ్ యార్డులలో మాత్రమే చెత్త డంప్ అయ్యేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా పరిషత్ ఇంచార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.శ్రీరామ్, జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి విద్యాచందన, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, పంచాయతీరాజ్ ఎగ్జి క్యూటీవ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళి, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సురేష్‌బాబు, ఇ.ఇ కృష్ణలాల్, డి.ఇలు రంగారావు, ధరణికుమార్, స్వరూపరాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.