Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-కొత్తగూడెం
శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలో పేరుకుపో యిన సమస్యలను పరిష్కరించకపోతే ప్రజాందోళన తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య హెచ్చరించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం, శ్రీనగర్ గ్రామ పంచాయతీ లో నెలకొని ఉన్న రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు, పారిశుధ్యం గురించి పార్టీ జిల్లా కమిటీ ప్రతినిధి బృందం, పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తదితరులు శ్రీనగర్ గ్రామ పంచాయతీలో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాసాని ఐలయ్య మాట్లాడుతూ పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీలు, ఇంటి పన్నులు, పారిశుధ్యం నిర్వహణలో గ్రామ పంచా యతీలో పాలక మండలి వైఫల్యం కారణంగా ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ఎంపీడీవో నుండి డీపీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. దీనిఫలితంగా ఇప్పటికీ వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తచేశారు. వీటి వల్ల సీజనల్ వ్యాధలు ప్రజలకు సోకే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఉన్నత స్థాయి అధికారులు కలగ జేసుకుని ప్రజాసమస్యలను పరిష్కరించ కపోతే డీపీఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా పంచాయతీ పరిధిలో విధులు దుర్వినియోగం, అవినీ తిపై ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసి కొంత సమాచారం తీసుకొని ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించుకున్నా నేటికి విచారించ లేదని కంచే చేను మేసిన విధంగా అధికారుల తీరు ఉన్నదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర విడనాడి అవినీతిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాటోత్ కృష్ణ, మండల కార్యదర్శి నల్లమల సత్యనారాయణ మండల నాయకులు యు.నాగేశ్వరరావు, తుమ్మలపల్లి లక్ష్మయ్య, మనీ,సరోజ, బాలసాని శ్రీను పాల్గొన్నారు.