Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు భూముల పట్టాల కోసం ప్రదర్శన, ధర్నా.: అఖిలపక్షం
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని సిద్దారం గ్రామం గిరిజనుల పట్ల ఫారెస్ట్ అధికారుల వేధింపులు మానుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో పోడు భూముల సాగు దారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టేకులపల్లి బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. తహసిల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దారు కె.వి.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎన్డీ జిల్లా నాయకులు బానోత్ ఊక్లా అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, బేతంపుడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భూక్య మంగీలాల్, భూక్య ధళ్ సింగ్, టీపీఎఫ్ సంజీవరావులు మాట్లాడారు. హరితా హరం పేరుతో గిరిజనుల సాగు భూములు లాక్కోవటం సిగ్గు చేటన్నారు. సిద్దారం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. మండలంలో అటవీ హక్కుల చట్టం ప్రకారం సర్వే చేసిన భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దార ంలో మహిళపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కేసు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా నాయకులు ఏపూరి బ్రహ్మం, రామచందర్, న్యూ డెమోక్రసీ మండల నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, వీరబ్రహ్మ చారి, భూక్య హర్జ్య, రామస్వామి, సుందర్, రాంచందర్, సీపీఐ(ఎం) నాయకులు, ఎంపీటీసీ రామక్రిష్ణ పాల్గొన్నారు.