Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రుపాలెం : రేషన్‌షాపు ద్వారా గత ప్రభుత్వం తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం తప్ప ఎటువంటి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం లేదనిమధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు, ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా ఏమి సరుకులు అందుతున్నాయని ఈ సమావే శానికి వచ్చిన ప్రజలను ప్రశ్నించగా బియ్యం తప్ప ఏమి ఇవ్వటం లేదని సభికులు తెలిపారు, మండల కేంద్రమైన ఎర్రుపాలెం లోని ధూప కుంట్ల సుబ్బారావు ఫంక్షన్ హాల్ నందు తాసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమానికి మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్కతో పాటు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు తొలుత మాట్లాడుతూ. మధిర నియోజకవర్గంలో గల ఐదు మండలాలలో ఎర్రుపాలెం మండలం లొనే అత్యధికంగా 716 నూతన రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పెండింగ్ లో ఉన్న మిగిలిన రేషన్ కార్డులను కూడా త్వరలో లబ్ధిదా రులకు అదేవిధంగా రెవిన్యూ అధికారులు చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, వైస్ ఎంపీపీ రామకోటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ మొగిలి అప్పారావు,వివిధ గ్రామాల పంచాయతీ సర్పంచులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,ఇనప నూరి శివాజీ, భూసిపల్లి వెంకటరెడ్డి, గోసు రామారావు, భాస్కర్ రెడ్డి, ఎర్రమల రేణుక, కత్తి నాగమణి, వేమిరెడ్డి అనురాధ, సుందరమ్మ, ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకష్ణ, డిప్యూటీ తాసిల్దార్ కె ఎం ఎం అన్సారీ పాల్గొన్నారు.
వైరా : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి సంబంధించిన 441 రేషన్ కార్డులను ఎంఎల్ఏ రాములు నాయక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రంగారావు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మున్సిపల్ చైర్మన్ సూతకని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ల పాటి సీతారాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు లాల్ మొహమ్మద్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే కాసిం ఎంపీడీవో వెంకటపతిరాజు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ పాల్గొన్నారు.
కారేపల్లి : కారేపల్లి వైఎస్ఎన్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్ చేతుల మీదిగా రేషన్‌కార్డులు అందజేశారు. 477 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు 47 మందికి రూ.47,05,452 విలువైన చెక్‌లను అందజేశారు. ఈకార్యక్రమం లో సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి, కోఆప్షన్ ఎండీ.హనీఫ్, తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎంపీడీవో మాచర్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
చింతకాని : సోమవారం మండల కేంద్రంలో రైతు వేదిక లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తో కలిసి జెడ్పీ ఛైర్మెన్ లింగాల కమల్‌రాజు నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణయ్య, జడ్పిటిసి కిషోర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్, చింతకాని సహకార సంఘం అధ్యక్షులు కొండపల్లి శేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ హనుమంతరావు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, తహసిల్దార్ తిరుమలాచారి, ఎంపీడీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : మండల కేంద్రమైన ముదిగొండలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులతోపాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఈకార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్ జడ్పిటిసి పసుపులేటి దుర్గ తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్ ఎంపిడిఓ డి శ్రీనివాసరావు ఎంపీవో పి సూర్యనారాయణ రైతు సమన్వయసమితి మండల కన్వీనర్ పొట్ల ప్రసాద్ ఆర్ఐ ఎం ఏకవీర ముదిగొండ గ్రామసర్పంచ్ మందరపు లక్ష్మి ఎంపీటీసీ సభ్యురాలు బలంతు జయమ్మ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం లో సోమవారం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్, ఎంపీడీవో జయరామ్, తహసిల్దార్ రవికుమార్, జెడ్పిటిసి బెల్లం శ్రీను, సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.