Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఉద్యాన వ్యవసాయ అధికారుల సూచన
నవతెలంగాణ-రఘునాధపాలెం
జిల్లాలో పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు జిల్లాలో నిస్సంకోచంగా పంట సాగు చేపట్టవచ్చని అధికారులు, ప్రజా ప్రతినిధులు, శాస్త్రవేత్తలు చెప్పారు. రఘునాధపాలెం మండలం రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ఖమ్మం డివిజన్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర రావు, కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్త హేమంత్ కుమార్, ఖమ్మం డివిజన్ ఉద్యాన అధికారి, గుడిమళ్ళ సందీప్ కుమార్ ఖమ్మం డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస రావు, మండల వ్యవసాయ అధికారి భాస్కర్ రావు, మంచుకొండ సొసైటీ చైర్మన్ మందరపు సుధాకర్ శాస్త్రవేత రవికుమార్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పామాయిల్ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ, అనూష శివ, రైతులు కుర్ర భాస్కర్ రావు, మండల కన్వీనర్ దోంతు సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ,గుత్త రవి, కాపా భూ చక్రం, రామారావు, సుధాకర్ ,తదితరులు పాల్గొన్నారు.