Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో సీపీఐ రాస్తారోకో
నవతెలంగాణ -ఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో 50 సంవత్సరాలుగా తాత్కాలిక నివాసలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలనివాసాలను కూల్చివేయడమేకాక, కమ్యూనిస్టుపార్టీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేశారని, అరెస్టులతో ఆందోళనలను ఆపలేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. మంగళవారం సీపీఐ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఖమ్మం బస్టాండ్ ఎదుట పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్ర బలగాలను దింపి తమది కాని స్థలంలో నివాసముంటున్నవారిని రైల్వే అధికారులు అక్రమంగా తొలగించారని, వర్షాకాలంలో అర్ధరాత్రిపూట నిర్వసితులను చేస్తే వారు ఎక్కడ జీవించాలని ప్రశ్నించారు. పేదల పక్షాన పనిచేస్తున్న సి.పి.ఐ నాయకులను నిర్భందించారని ఇది ఎక్కడి ప్రజా స్వామ్యమని హేమంతరావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు శింగునర్సింహారావు, బి.జి. క్లైమెంట్, పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
చింతకాని : కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ నాయకులను అక్రమంగా నిర్భందించి అరెస్ట్ లు చేయడాన్ని సిపిఐ చింతకాని మండల సమితి ఖండించింది.
బోనకల్ : కొత్తగూడెం పట్టణంలో సీపీఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కలకోట బస్టాండ్ సెంటర్లో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
మణుగూరు: కొత్తగూడెంలో వామపక్ష నాయకులను అక్రమంగడా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సిపిఐ కార్యాలయం సెంటర్ నందు ధర్నా నిర్వహించారు.